ఆడవారిలో పొత్తి కడుపు నొప్పికి కారణం ఏంటి?

lower abdominal pain in females

పొత్తికడుపు నొప్పి అనేది మహిళలను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యల్లో ఒకటి. దీని ద్వారా బొడ్డు కింద ఉన్న పొట్ట ప్రాంతంలో నొప్పి వస్తుంది. దీనిని పెల్విక్ నొప్పి అని కూడా అంటారు.

మహిళల్లో కడుపు నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది రుతుక్రమం వరుస తప్పడం నుంచి ప్రేగు సంబంధిత రుగ్మతల వంటి సమస్యలతో రావొచ్చు. ఇది అన్ని వయసుల మహిళలను ఇది ప్రభావితం చేసే విషయం.

వీటిల్లో కొన్ని అంశాలు చాలా తీవ్రమైనవిగా ఉండవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. ఈ పరిస్థితుల్లో కొన్ని అంశాల గురించి తెలుసుకోవడం వల్ల వాటిని నివారించడంలో సహాయపడుతుంది.

ఆడవారిలో పొత్తి కడుపు నొప్పికి కారణాలు ఏంటి?

దిగువ పొత్తి కడుపు అనేది వివిధ అవయవాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండే ప్రాంతం. కాబట్టి మీ పొట్ట సమీపంలోని ప్రాంతాల్లో నొప్పి కూడా వివిధ కారణాలతో సంభవించవచ్చు.

పొత్తి కడుపులో నొప్పి

ఆడవారిలో పొత్తికడుపు మరియు వెన్నునొప్పి వారు అనుభవించే సమస్యల్లో ఒకటి. దిగువ ఉదరం మహిళల్లో రెండు ప్రధాన అవయవాలను కలిగి ఉంటుంది. అవే ప్రేగు మరియు గర్భాశయం.

కాబట్టి మీకు మీ పొత్తి కడుపులో నొప్పి అనిపిస్తే.. అది అవయవాలకు సంబంధించిన కొన్ని అసౌకర్య సమస్యల కారణంగా ఉంటుంది.

నెలసరి తిమ్మిరి

రుతుస్రావం సమయంలో లేదా పీరియడ్ సమయంలో అనుభవించే నొప్పులు స్త్రీలకు చాలా తీవ్రంగా ఉంటాయి. దీన్నే డిస్మెనోరియా అని అంటారు.

మీ పొత్తికడుపులో ఈ నొప్పి తరచుగా మీ వెనుక నుంచి వ్యాపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది వికారం, తలనొప్పి, విరేచనాలకు కూడా కారణం కావొచ్చు.

ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మనం పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం సర్వసాధారణం. కానీ పెయిన్ కిల్లర్స్ నిత్యం తీసుకోవడం వల్ల కొన్ని అవాంఛనీయ దుష్ప్రభావాలకు దారితీయవచ్చు.

అయితే, నొప్పిని ఈ మార్గాల ద్వారా నియంత్రివచ్చు

1. వేడి నీటి బాటిల్ లేదా హీటింగ్ ప్యాడ్ ఉపయోగించి మీ పొత్తికడుపు దిగువ భాగంగా మర్దన చేయండి.

2. తులసి, ఫెన్నెల్, గులాబీ వంటి ముఖ్యమైన నూనెలతో మీ పొత్తికడుపును మసాజ్ చేయండి.

3.రుతుస్రావం సమయంలో కొవ్వు పదార్థాలు, కెఫిన్, ఆల్కహాల్ మరియు కార్బోనేటెడ్ పానీయాలను తీసుకోవద్దు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI)

మన మూత్ర వ్యవస్థ సాధారణంగా సూక్ష్మజీవుల ద్వారా బాహ్య ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి రూపొందించబడింది. కానీ కొన్నిసార్లు ఈ రక్షణ సరిపోకపోవచ్చు. కొన్ని బ్యాక్టీరియాలు మీ మూత్ర వ్యవస్థలోకి ప్రవేశించవచ్చు.

ఈ బ్యాక్టీరియాలు పెరగడంతో మీ పొత్తికడుపులో నొప్పికి దారితీసే ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.

ఈ అంటువ్యాధులు కొన్నిసార్లు ద్రవాలు, నీటిని తీసుకోవడం ద్వారా దూరం కావొచ్చు. కొన్నిసార్లు తీవ్రంగా కూడా ఉండవచ్చు. మీ మూత్రపిండాలను కూడా ప్రభావితం చేయవచ్చు.

తీవ్రమైన UTI మీ పొత్తికడుపులో రెండు వైపులా దీర్ఘకాలిక నొప్పికి దారితీస్తుంది

UTIని ఇలా నియంత్రించవచ్చు మరియు నిరోధించవచ్చు

1.నీరు, ఇతర ద్రవాలను పుష్కలంగా తాగాలి

2.క్రాన్బెరీ జ్యూస్ తాగాలి(దీనిపై సరైన అధ్యయనం లేకపోయినా చాలామంది మహిళలు సిఫార్సు చేశారు)

3.డియోడరెంట్లు, పౌడర్‌లు మొదలైన చర్మానికి చికాకు కలిగించే ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి.

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి

ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి స్త్రీ యొక్క పునరుత్పత్తి అవయవాలలో సంక్రమణ కారణంగా సంభవిస్తుంది. ఇది యోని నుంచి గర్భాశయం, అండాశయాలు మరియు ఫెలోపియన్ ట్యాబ్‌లకు లైంగికంగా సంక్రమించే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది.

తేలికపాటి ఇన్ఫెక్షన్లతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతున్నప్పుడు, పొత్తి కడుపు ప్రాంతంలో తీవ్రమైన నొప్పి ఉండవచ్చు. ఇది తీవ్రం కాకుండా ముందు జాగ్రత్తగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

దిగువ ఎడమ పొత్తికడుపులో నొప్పి

కొందరికి పొత్తికడుపు ఎడమభాగంలో నిరంతరం నొప్పి రావొచ్చు. దిగువ ఉదరం యొక్క ఎడవ వైపు పెద్దప్రేగు మరియు అండాశయం ఉన్నాయి.

చాలా తరచుగా జీర్ణక్రియలో సమస్యలు మీ ఉదరం యొక్క దిగువ ఎడమ వైపున నొప్పిని కలిగిస్తాయి. అయితే మీ పొత్తికడుపులో నొప్పికి కొన్ని విచిత్రమైన కారణాలు ఉండవచ్చు.

గ్యాస్

మీరు అనుకోకుండా అత్యధికంగా గాలిని మింగినప్పుడు.. అది మీ పొత్తికడుపు యొక్క దిగువ ఎడమ వైపుకు వెళ్తుంది. అలాగే జీర్ణక్రియ ప్రక్రియలో బ్యాక్టీరియా ఆహారాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుంది. మీరు గ్యాస్ వచ్చే ఆహారాన్ని తీసుకున్నప్పుడు శరీరంలో గ్యాస్ పేరుకుపోతుంది.

కొద్దిపాటి గ్యాస్ వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. అయితే పరిమితికి మించినప్పుడు, మీరు మీ ఉదరం యొక్క ఎడమ వైపును కొంత అవాంఛనీయమైన నొప్పిని అనుభవించవచ్చు.

డైవర్టిక్యులర్ వ్యాధి

మీ పెద్దప్రేగు గోడలో చిన్న చిన్న ఉబ్బెత్తులు ఉంటే.. దానిని డైవర్టిక్యులర్ వ్యాధిగా సూచిస్తారు. ఈ గడ్డలు అవి పెరిగినప్పుడు, మీ పొత్తి కడుపులో నొప్పిని కలిగిస్తాయి. ఇది విరేచనాలు మరియు రక్తస్రావం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు.

మీరు పొత్తికడుపులో ఎక్కువసేపు నొప్పిని కలిగి ఉండి, మీ మలంలో రక్తం లేదా ముదురు రంగులో ఉన్న మలం చూసినప్పుడు.. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడ్ని సంప్రదించండి.

దిగువ కుడి పొత్తికడుపు

మీరు మీ కుడి దిగువ పొత్తికడుపులో నొప్పి వస్తే.. అది మీ అపెండిక్స్‌ తో కొన్ని సమస్యల వల్ల కావొచ్చు. ఇది మీ పెద్ద ప్రేగు ప్రారంభంలో ఉన్న చిన్న భాగం.

గోధుమలు, ఓట్స్, బ్రౌన్ రైస్ మొదలైన ఆహారాలు తీసుకోవడం వల్ల అపెండిసైటిస్‌ను నివారించవచ్చు.

దిగువ పొత్తికడుపు నొప్పికి కొన్ని ఇతర కారణాలు

కండరాల నొప్పి

కొన్ని సందర్భాల్లో మీ పొత్తికడుపు కండరాలలో ఒత్తిడి కారణంగా కడుపునొప్పి వస్తుంది. గాయాల సమయంలో పక్కనపెడితే.. వ్యాయామాలు చేయడం ద్వారా ఉదరకండరాలకు కొన్నిసార్లు ఇబ్బంది ఏర్పడుతుంది.

ముఖ్యంగా కొన్నిసార్లు వ్యాయామం, ఇతర వర్కౌట్స్ చేసినప్పుడు మీరు మీ పొత్తికడపు కండరాలపై ఒత్తిడికి గురవుతారు. దీని ఫలితంగా కూడా నొప్పి వస్తుంది.

గర్భం నొప్పి

గర్భం అనేది ఒక అందమైన శక్తిని వినియోగించే ప్రక్రియ. ఇది స్త్రీ శరీర నిర్మాణాన్ని మారుస్తుంది. ఇది స్త్రీ యొక్క అవయవాలు మరియు కండరాలలో, ముఖ్యంగా పొత్తికడుపులో ఒత్తిడి, నొప్పిని కలిగిస్తుంది.

స్త్రీ ఉదర కండరాలు ప్రసవం కోసం గర్భం తర్వాత తమను తాము సర్దుబాటు చేసుకుంటాయి. ఇది కండరాలను ఒత్తిడి చేస్తుంది. మరియు సంకోచిస్తుంది. దీంతో ఆ ప్రాంతం చుట్టూ నొప్పి ఉంటుంది.

ఇది చాలా సందర్భాలలో తీవ్రమైనది కాదు. కానీ మీకు తీవ్రమైన నొప్పి లేదా యోని ఉత్సర్గ/రక్తస్రావం అనిపిస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.

ఎక్టోపిక్ గర్భం(గర్భసంచికి బయట పిండం ఏర్పడటం)

ఆడవారి ఫలదీకరణ గుడ్డు గర్భాశయం వెలుపల ఏర్పడినప్పుడు ఈ ఎక్టోపిక్ గర్భం ఏర్పడుతుంది. ఎక్కువ సమయాల్లో గుడ్డు ఫెలోపియన్ గొట్టాలలో ఏర్పడుతుంది.

అలా గర్భాశయానికి బయట ఏర్పడే గుడ్డు శిశువుగా అభివృద్ధి చెందదు. ఒకవేళ అభివృద్ధి చెందితే మాత్రం గర్భిణీ స్త్రీకి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది ఆడవారి పొత్తికడుపు ప్రాంతంలో తేలికపాటి నుంచి దీర్ఘకాలిక నొప్పికి కారణం అవుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి.. అవసరమైన చికిత్సను పొందడం చాలా మంచిది.

చివరిగా

మహిళల్లో కడుపు నొప్పి సమస్యలు చాలా సాధారణం. కానీ పొత్తికడుపు నొప్పికి కారణమేమిటి అనేది పరిశీలించాల్సిన కీలక ప్రశ్న.

ఇలాంటి సమస్యలను చాలావరకు ఇంటి చిట్కాల ద్వారా పరిష్కరించవచ్చు. కొన్ని కారణాలతో వల్ల వచ్చే వాటికి తక్షణ నిర్ధారణ మరియు వైద్య చికిత్స చాలా అత్యవసరం.

అందువల్ల మీ పొత్తి కడుపులో ఎక్కువ కాలం నొప్పి ఉన్నట్లు అనిపిస్తే.. మీరు మీ సమీప ఆస్పత్రిని సందర్శించడం మంచిది.

Scroll to Top